కోట వద్ద ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
గద్వాల జిల్లా కేంద్రంలోని కోట వద్ద బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు, యువకులు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.