'ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలి'
BHNG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని SFI ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆలేరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని SFI కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.