ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

MDCL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌‌లో చోటుచేసుకుంది. అవుషాపూర్‌కి చెందిన మేడబోయిన పోచయ్య సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కుమార్తె వివాహం కోసం ఇల్లును విక్రయించాడు. ఆర్థిక ఇబ్బందులతో కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.