ప్రమాదకరంగా నెరెళ్ల వాగు వంతెన
GNTR: ఫిరంగిపురం-113 తాళ్లూరు గ్రామాల మధ్య నెరెళ్ల వాగు వద్ద ఉన్న వంతెన ఇటీవల వర్షాల ప్రభావంతో పూర్తిగా దెబ్బతింది. వంతెన స్లాబ్ ఒక వైపు విరిగి కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. R&B, పంచాయతీరాజ్ అధికారులు తక్షణం స్పందించి వంతెనకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు.