నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరకు అంతరాయం

NGKL: వంగూర్ మండలం సర్వారెడ్డిపల్లి, డిండి చింతపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల ఇంఛార్జ్ ఎఈ వెంకటేశ్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.