రోడ్డు ప్రమాదం.. ఎద్దు మృతి

రోడ్డు ప్రమాదం.. ఎద్దు మృతి

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలో దొనకొండ అడ్డ రోడ్డు నుంచి కొనకలమిట్లకు వెళ్లే రహదారిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రహదారిలో వెళుతున్న ఎద్దులను వెళుతున్న ఎద్దులను ఆటో ఢీకొనడంతో ఓ ఎద్దు మరణించింది. ఎద్దులతో పాటు పొలం వెళ్తున్న రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.