గంగానదిలో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్

గంగానదిలో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్

వారణాసి గంగాతీరంలో ఇఫ్తార్ విందు కలకలం రేపింది. పడవలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది యువకులు అస్సీ ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు ప్రయాణించేలా ఒక పెద్ద పడవను బుక్ చేసి అందులో పండ్లు, డ్రై ప్రూట్స్‌తో పాటు చికెన్ బిర్యానీని కూడా తీసుకున్నారు. వారణాసిలో గంగా నది పరిసరాల్లో, నదిపై మాంసాహారం, మద్యం సేవించడంపై కఠినమైన నిషేధం ఉంది.