మద్యం మత్తులో పోలీస్ గన్‌మన్ వీరంగం

మద్యం మత్తులో పోలీస్ గన్‌మన్ వీరంగం

WGL: వరంగల్‌లో మద్యం మత్తులో ఓ పోలీస్ గన్‌మన్ హంగామా సృష్టించాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన మహేష్ బాలరాజు శుక్రవార అర్ధరాత్రి సెంట్రల్ జైలు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆటో డ్రైవర్‌తో గొడవకు దిగాడు. అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మట్టెవాడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.