'బీసీ హాస్టల్‌లో సమస్యలు పరిష్కరించాలి'

'బీసీ హాస్టల్‌లో సమస్యలు పరిష్కరించాలి'

ASR: చింతపల్లి బీసీ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ హాస్టల్‌ను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. బీసీ హాస్టల్‌లో నాలుగు గదులు, 78 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. గదులు పెచ్చులు ఊడిపడుతున్నాయన్నారు. గదుల్లో వర్షపు నీరు కారిపోతుందన్నారు.