విద్యార్థిని మృతిపై విచారణ చేయాలి: సీపీఐ
NLR: కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన బాలిక మరణ ఘటనపై తక్షణమే క్రిమినల్, డిపార్ట్‌మెంటల్ దర్యాప్తు చేయాలని సీపీఐ నేతలు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సీపీఐ నేత దామా అంకయ్య మాట్లాడుతూ.. జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 14 ఏళ్ల బాలిక హాస్టల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు.