గాజువాకలో చెరువులను తలపిస్తున్న రహదారులు

గాజువాకలో చెరువులను తలపిస్తున్న రహదారులు

VSP: మోంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాజువాక ప్రాంతంలోని రహదారులు పూర్తిగా జలమయమ‌య్యాయి. ప్రధాన రహదారులు, అంతర్గత దారులు సైతం వర్షపు నీటితో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.