బాధితురాలికి ఆర్ధికసాయం చేసిన టీడీపీ నేతలు

సత్యసాయి: సోమందేపల్లి మండలం మారుతినగర్‌లో ఇటీవల కురిసిన వర్షానికి గంగమ్మ అనే మహిళ ఇల్లు పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంటు టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ శనివారం గంగరత్నమ్మ ఇంటికి వెళ్ళారు. బాధితురాలిని పరామర్శించి పడిపోయిన ఇంటిని పరిశీలించారు. అనంతరం రూ. 5 వేలు ఆర్థిక సహయం చేసి, నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు.