ఆటో బోల్తా.. వ్యక్తులకు గాయాలు
ASR: అరకులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరాపల్లి గ్రామానికీ చెందిన కిల్లో జయరాం ఆటోలో పెళ్లి కార్యానికి చంపగుడ వెళ్లి తిరిగి వస్తుండగా,జంగుడ బ్రిడ్జి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని 108 వాహనంలో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.