ఏలూరు జాతరలో పాల్గొన్న హోం మినిస్టర్
ఏలూరు నగరంలోని స్థానిక తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి సోమవారం తెల్లవారుజామున రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయ అర్చకులు కమిటీ నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు.