తునికి నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు
MDK: కౌడిపల్లి మండలం తునికి శ్రీ నల్లపోచమ్మ దేవస్థానంలో కార్తీక మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం, పట్టువస్త్రాలు సమర్పించి, ధూప దీప నైవేద్యాలతో అభిషేకాలు చేశారు. తదనంతరం అర్చకులు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.