గిరిజన ప్రాంత భూములు కాపాడాలని నిరసన
ASR: కొయ్యూరు మండలం రత్నంపేటలో గ్రామ కంఠం భూమిలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని గిరిజన యువకుడు పాటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత భూములు పరిరక్షించాలని అధికారులను కోరారు. ఈమేరకు, బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.