VIDEO: ఘోర ప్రమాదం.. యాసిడ్ పడి మహిళ మృతి

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు యాసిడ్ డ్రమ్ములుతో వెళ్తున్న ట్రక్ ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వెనుక కూర్చున్న మహిళపై యాసిడ్ పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ప్రమాదం తర్వాత ఆటో డ్రైవర్ పరారయ్యాడు.