VIDEO: కందకం తవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా: MLA
ADB: గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి వెళ్లే మార్గంలో ఫారెస్ట్ అధికారులు కందకం తవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో MLA మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గిరిజన ప్రజలను ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ద్వారా సమాచారం తీసుకోవాలని కోరారు.