VIDEO: వింత వాతావరణంతో ఆందోళనలో రైతులు

VIDEO: వింత వాతావరణంతో ఆందోళనలో రైతులు

కోనసీమ: ముమ్మిడివరం మండలం అనాతవరంలో వింత వాతావరణంతో కూరగాయలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం విపరీతమైన మంచుతో, మధ్యాహ్నం అధిక ఎండతో కూరగాయల పంటలు చీడ పట్టి పాడై పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధిక పెట్టుబడులు పెట్టామని, ఈ వాతావరణంతో నష్టపోయే అవకాశం ఉందని, ఇదే పరిస్థితి కొన్నాళ్లు ఉంటే దిగుబడి లేక కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.