VIDEO: రేపు కోటంచ లక్ష్మి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

BHPL: రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు జరుగుతాయని బుధవారం ఆలయ ఈవో మహేశ్ తెలిపారు. లోక కళ్యాణార్ధం ప్రతి నెలలో వచ్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ స్వామివారి అభిషేకం, శ్రీ స్వామి వారి కళ్యాణం, ఆరగింపు జరుగుతుందన్నారు.