రేపు రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమం
RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చించోడు క్లస్టర్ గ్రామాల పరిధిలో రేపు రైతు వేదిక వద్ద ఆత్మ(ATMA) వారి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నిశాంత్ తెలిపారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.