అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌లో ఘోరం జరిగింది. ఓ హోటల్‌లో చిన్నారి బర్త్‌డే పార్టీ జరుగుతుండగా.. దుండగులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చిన్నారులతో సహా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.