'నిందితులను కఠినంగా శిక్షించాలి'

'నిందితులను కఠినంగా శిక్షించాలి'

KMM: విద్యార్థిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం నాయకులు కోరారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన పీజీ విద్యార్థిని శ్రీవిద్య మృతి ఘటనపై ఇవాళ మధిరలో మున్నూరు కాపు సంఘం నాయకులు సమావేశమై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధ్యక్షుడు ఆళ్ల కృష్ణ డిమాండ్ చేశారు.