ఇంటర్ టాపర్‌లకు సన్మానం చేసిన సర్పంచ్

ఇంటర్ టాపర్‌లకు సన్మానం చేసిన సర్పంచ్

HNK: ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థినిలు దుపెల్లి రశ్మిత, కావటి అశ్విత, తాటికాయల జాస్మికలను గ్రామ సర్పంచ్ దుపెల్లి రాకేష్ శుక్రవారం సన్మానించారు.  ఆయన మాట్లాడుతూ.. గ్రామం నుంచి మంచి మార్కులు సాధించడం గర్వకారణమని, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి, మంచి పేరు తీసుకురావాలన్నారు.