మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన 2026-27 బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై, ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించారు. అనంతరం, 63 కోట్ల 33 లక్షల 70 వేల రూపాయల బడ్జెట్ అంచనాలకు మున్సిపాలిటీ పాలక వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.