'బాధితులకు సత్వర న్యాయం చేయాలి'
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.