'పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలి'

'పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలి'

ప్రకాశం: పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. బుధవారం సి ఎస్ పురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టేషన్లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.