'రేపు సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయాలి'

KMM: ఈ నెల 7న ఖమ్మంలో జరిగే పాలస్తీనా సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యవర్గ సభ్యులు గుడిమెట్ల రజిత పిలుపునిచ్చారు. బుధవారం వైరా పట్టణంలోని సుందరయ్య నగర్‌లో ఐద్వా ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులను నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.