శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
SKLM: కంచిలి మండలం తలతంపర గ్రామంలో శివాలయం వద్ద శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు మూడు రోజులు జరుగుతున్న కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు జరగనున్నాయి. శనివారం ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.