VIDEO: 'తొర్రూరులో ధర్మం కాంగ్రెస్ వైపే ఉంది'
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీలో ధర్మం కాంగ్రెస్ వైపు ఉందని అందుకే లక్కీ డ్రా కూడా కాంగ్రెస్‌కు న్యాయం చేసిందని, ఇకనైనా దయాకర్ రావుకు బుద్ధి రావాలని కాంగ్రెస్ నాయకురాలు పంజా కల్పన అన్నారు. మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌కు దక్కిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దయాకర్ రావు మాయమాటలకు మోసపోయిన నిలువెత్తు సాక్షిని నేనని, నీ అరాచకాలను ఎండగడతామని తెలిపారు.