రాష్ట్రపతిని కలిసిన T20 WC విజేతలు
అంధుల మహిళల T20 WC గెలిచిన భారత క్రికెట్ జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆటగాళ్లు తము ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను రాష్ట్రపతికి బహూకరించారు. ముర్ము మాట్లాడుతూ.. అంధుల మహిళల జట్టును అభినందించారు. వారి విజయం దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే, వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు