20 నుంచి అహోబిలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం CAO వీఎల్ఎన్ రామానుజన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎగువ అహోబిలంలో 22న ధ్వజారోహణం, 28న కళ్యాణం తదితర వాహన సేవలు, దిగువ అహోబిలంలో 23న ద్వజారోహణం, మార్చి 1న కళ్యాణం, 3న రథోత్సవం, 4న గరుడసేవ తదితర వాహన సేవలు ఉంటాయన్నారు.