అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
KRNL: ఎమ్మిగనూరు పట్టణం శివసర్కిల్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ ముందు అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన టీకే లాల్ బరియా (36)గా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఇతను చెన్నాపురం సమీపంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.