VIDEO: సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన
VSP: పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం సీపీఎస్ ఉద్యోగులు విశాఖలో ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన ‘సాగర సంగ్రామ దీక్ష’లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.