పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం

పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం

NRML: భైంసా మండలం వాలేగాం గ్రామంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్యా శిబిరాన్ని నిర్వహించారు. భైంసాకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు బీ.నరేష్ నవజాత శిశువులతో పాటు చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్, వైరల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.