'క్రమశిక్షణతో విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలు'
KNR: క్రమశిక్షణతో విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ఆర్డీవో కే. మహేశ్వర్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంఈవో వాసవి హాజరయ్యారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.