VIDEO: నేలపై కూర్చొని గ్రామ సర్పంచ్ నిరసన
ATP: గుంతకల్లు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నెలగొండ గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ సమావేశంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు.