రేషన్ కార్డుదారులకు అలర్ట్

AP: రాష్ట్రంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి మే నెల నుంచి కందిపప్పు అందుతుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే కందిపప్పు వస్తుందని ఆశించినవారికి నిరాశ మిగిలింది. పౌరసరఫరాల శాఖ నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఏడాది మొదటి నుంచి పంచదార, బియ్యం మాత్రమే సరఫరా అవుతోంది. అయితే పప్పు మాత్రం వచ్చే నెల నుంచే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.