పోలీసుల అదుపులో ఆటో యూనియన్ నాయకులు

పోలీసుల అదుపులో ఆటో యూనియన్ నాయకులు

HNK: రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో యూనియన్ నాయకులను హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ నాయకుల పిలుపు మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు.