కర్నాటకకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ATP: డి.హిరేహాల్ మండల సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక కర్నాటక ప్రాంతాలకు యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. తాజాగా హిర్దేహాల్ సమీపంలోని యల్లమ్మ కొండ వద్ద బయలు ప్రదేశంలో కర్నాటకకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక డంప్‌ను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శనివారం రాత్రి ఎస్సై గురుప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకుని డంప్ స్వాధీనం చేసుకున్నారు.