యువతకు డ్రగ్స్‌పై అవగాహన సదస్స
MBNR: "సురక్షితంగా ప్రయాణించి.. సురక్షితంగా చేరుకుందాం" కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర SI నాగన్న సోమవారం కౌకుంట్లలో విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వాటి వల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. 'అలైవ్ - అర్రైవ్' నినాదంతో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు.