మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 2వ వార్డు అభ్యర్థిగా కుంభం మహేష్ గౌడ్, 12వ వార్డు అభ్యర్థిగా చింతల మధు గురువారం నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, జనసేన పార్టీకి గెలుపు ఓటమితో పనిలేదన్నారు. జనసేన పార్టీ అంటేనే ప్రజా గొంతుకని పేర్కొన్నారు.