అలర్ట్.. గండి పోచమ్మ దారి మళ్లింపు

అలర్ట్.. గండి పోచమ్మ దారి మళ్లింపు

E.G: సీతానగరం మండల పరిధిలోని పురుషోత్తపట్నం గ్రామ సమీపంలోని పుణ్య క్షేత్రమైన గండి పోచమ్మ తల్లి ఆలయానికి పురుషోత్తపట్నం నుంచి రాకపోకలు జరిగేవి. అయితే, ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు నిమిత్తం ఆలయ దారిని రాపాక, కోటికేశవరం, శ్రీరంగపట్నం, గోకవరం, దండంగి, పోతవరం మీదుగా మళ్లించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు గమనించాలని సూచించారు.