'గ్రంధాలయ సభ్యత్వంపై అవగాహన కల్పించాలి'

ASR: అరకువేలి శాఖా గ్రంథాలయాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రు కుమార్ రాజు తనిఖీ చేశారు. ముందుగా ఆయన గ్రంధాలయంలో రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయ సభ్యత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త పుస్తకాలను అందుబాటులో ఉంచాలని లైబ్రేరియన్ ఎస్.సునీతకు సూచించారు. గ్రంధాలయానికి ఎంతమంది పాఠకులు వస్తున్నారన్న వాటిపై వివరాలు సేకరించారు.