PMAY ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్
W.G: గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న ఆర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకంతో ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈనెల 30లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.