క్షిపణి దాడి.. భారతీయుడి మృతి
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలోని అబుధాబీలో ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిని అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, శకలాలు పడి ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ పాకిస్తానీ జాతీయుడు కూడా మృతి చెందినట్లు యూఏఈ అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడగా వీరిలోనూ ఒకరు భారతీయుడు ఉన్నట్లు యూఏఈ మీడియా వెల్లడించింది.