అకాల వర్షం.. భారీగా పంట నష్టం

అకాల వర్షం.. భారీగా పంట నష్టం

NZB: అకాల వర్షాలతో జిల్లాలో పంటలు భారీగా దెబ్డతిన్నాయి. వడగండ్ల వాన పడి వరి ధాన్యం నేలరాలగా.. మొక్కజోన్న కంకులు నెలకొరిగాయి. దీంతో ఆరుగాలం పండించిన పంట చేతుకువచ్చే సమయంలో వర్షం వచ్చి పంటను నాశనం చేసిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో నష్టపోయిన పంట వివరాలు..వరి 1,650, మొక్కజొన్న-820, అరటి-49,మామిడి-58 ఎకరాలు. తమను ఆదుకుని ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.