పదవ తరగతి విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, గట్టు మండలం చాగదోని గ్రామానికి చెందిన కె.టి.దొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థి చరణ్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం సన్మానించారు. పదవ తరగతిలో 574 మార్కులు సాధించిన చరణ్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.