విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు
టీవీకే అధినేత విజయ్ ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు వెలుగుచూశాయి. పెరంబూర్ స్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్న విజయ్.. మూడు రోజుల తర్వాత తిరుచురాపల్లి ఈస్ట్ స్థానానికి వేసిన నామినేషన్‌లో తనపై రెండు FIRలు నమోదైనట్లు వెల్లడించారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.