'ఎన్ని అవమానాలు ఎదురైనా నమ్ముకున్న దారిలో ముందుకు వెళ్లాలి'
HYD: ఎన్ని అవమానాలు ఎదురైనా నమ్ముకున్న దారిలో ముందుకు వెళ్లాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. జాగృతి తీసుకున్న సామాజిక న్యాయం అనే నినాదం సాధించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, తెలంగాణ సమాజంలో మార్పు కోసం కంకణబద్ధులై ఉండాలన్నారు. బీసీలలో మహిళా కోటా సాధించేవరకు విశ్రమించేది లేదన్నారు.